కొచ్చి: కొచ్చిలోని ఎలామక్కరలో ఆరేళ్ల కుమార్తెను హత్య చేసి తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది.
మరణించడానికి కొన్ని గంటల ముందు కూడా ఆ బాలికపై అఘాయిత్యం జరిగినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తి గురించి కీలక ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 16న కుమార్తెను చంపి, తండ్రి ప్రాణాలు తీసుకున్నాడు.
ఆ సమయంలో తల్లి ఇంట్లో లేదు. ఆమె తిరిగి వచ్చేసరికి భర్త, కుమార్తె విగతజీవులుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. అప్పుల బాధ లేదా ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ హత్య జరిగినట్లు మొదట భావించారు, కానీ పోస్ట్‌మార్టం రిపోర్ట్ కేసు మలుపు తిప్పింది.
