Renu Desai: ఏడేళ్ల వయసులోనే అలాంటి సంఘటన .. నటి రేణూ దేశాయ్ వీడియో

 నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. గతంలో  హీరోయిన్ గా నటించి మెప్పించారీ అందాల తార. అంతేకాదు దర్శకురాలిగా, నిర్మాతగానూ, కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ ఆకట్టుకున్నారు.



అయితే పెళ్లి, పిల్లల తర్వాత చాలా ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రేణూ దేశాయ్. చాలా గ్యాప్ తర్వాత రవితేజ టైగర్ నాగేశ్వరరావు లో ఓ కీలక పాత్రలో కనిపించినా అదొక్క కే పరిమితమయ్యారు.

 ప్రస్తుతం ఆధ్యాత్మిక, సామాజిక సేవా క్రమాలతో బిజీ గా ఉంటోన్న ఆమె మహిళలు, మూగజీవాల సమస్యలపై తన గళాన్ని వినిపిస్తున్నారు. ఆ మధ్యన వీధి కుక్కల అంశంపై రేణూదేశాయ్ నిర్వహించిన ప్రెస్ మీట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా ఈ నటి పూర్తిగా వెజిటేరియన్.

 మాంసానికి పూర్తిగా దూరంగా ఉంటారు. అయితే తాను శాకాహారిగా మారడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు రేణూ దేశాయ్. అంతేకాదు అందుకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఒక మేక పిల్లను బలి ఇవ్వడం నేరుగా చూశాను. అప్పటినుంచి ఇప్పటివరకు నేను నాన్ వెజ్ ముట్టుకోలేదు. మాది బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ మా నాన్న మాంసం తినేవారు. కానీ మా అమ్మ మమ్మల్ని మాంసం ముట్టు కోవద్దు అని ఎప్పుడూ ఆపలేదు. అయితే నేనే తినకూడదని నిర్ణయించుకున్నాను. 

ఏడేళ్ల వయసులో ఆ సంఘటన చూసినప్పటి నుంచి నేను పూర్తిగా మారిపోయాను. మా అమ్మ కఠినమైన శాకాహారి. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా ఆమె తీసుకునేది కాదు' అని వీడియోలో చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

https://www.instagram.com/reel/DUa3X8FgcJe/?utm_source=ig_web_button_native_share&igsh=NTc4MTIwNjQ2YQ%3D%3D

నటి రేణూ దేశాయ్ షేర్ చేసిన వీడియో ఇదిగో..

Post a Comment

Previous Post Next Post