Funky Review:బాక్సాఫీస్ వద్ద 'ఫంకీ' జాతర ఎలా ఉంది?

 Funky Review:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నుంచి సినిమా వస్తుందంటేనే అందులో ఏదో ఒక వెరైటీ ఉంటుందని ఆడియన్స్ ఆశిస్తారు దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్‌తో విపరీతమైన బజ్ క్రియేట్ చేసిన సినిమా 'ఫంకీ' (Funky).తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న విశ్వక్ సేన్ తొలిసారిగా జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్‌తో ఫంకీ అంటూ థియేటర్లోకి వచ్చాడు.



 ఫిబ్రవరి 13, 2026 థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం విశ్వక్ సేన్ మార్క్ ఎనర్జీతో ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో మన రివ్యూలో చూద్దాం.

  • నటీనటులు: విశ్వక్ సేన్, కాయదు లోహర్, నరేష్, వి.టి.వి గణేష్ తదితరులు
  • దర్శకత్వం: అనుదీప్ కె.వి
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • నిర్మాత: నాగవంశీ - సాయి సౌజన్య
  • విడుదల తేదీ: ఫిబ్రవరి 13, 2026

కథా నేపథ్యం:

కోమల్ (విశ్వక్ సేన్) ఒక సినిమా దర్శకుడు. తను తీస్తున్న 'ఫంకీ' సినిమా బడ్జెట్ హద్దులు దాటిపోవడంతో, నిర్మాత (నరేష్) తీవ్ర అనారోగ్యానికి గురవుతాడు. దాంతో రంగంలోకి దిగిన నిర్మాత కుమార్తె చిత్ర (కాయదు లోహర్), సినిమాను పూర్తి చేసే బాధ్యత తీసుకుని.. ముందుగా దర్శకుడిని మార్చేయాలని నిర్ణయించుకుంటుంది. తన సొంత సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిన దర్శకుడు కోమల్, మళ్ళీ తన సీటును ఎలా దక్కించుకున్నాడు? ఈ క్రమంలో జరిగిన వింత పరిణామాలు ఏంటి? అనేదే మిగతా కథ.

విశ్లేషణ - ఎలా ఉందంటే?

దర్శకుడు అనుదీప్ సినిమాల్లో లాజిక్ కంటే 'మ్యాజిక్' (కామెడీ) ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా విశ్వక్ సేన్ తన మాస్ ఇమేజ్‌ను పక్కన పెట్టి కామెడీ చేయడానికి బాగానే కష్టపడ్డాడు. వన్-లైనర్ డైలాగ్స్ కొన్ని చోట్ల నవ్వులు పూయించినా, పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయాయి.

ప్లస్ పాయింట్లు:

  • విశ్వక్ సేన్ నటన: కామెడీ టైమింగ్‌లో విశ్వక్ కొత్తగా కనిపించారు. తనదైన మేనరిజమ్స్‌తో సినిమాను నెట్టుకొచ్చే ప్రయత్నం చేశారు.
  • నటి కాయదు లోహర్: హీరోయిన్ స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించడమే కాకుండా, నటనలోనూ మంచి మార్కులు కొట్టేసింది.
  • నిడివి: సినిమా రన్-టైమ్ తక్కువగా ఉండటం ఒక పెద్ద ఊరట.

మైనస్ పాయింట్లు:

  • కథా బలం లేకపోవడం: సినిమా ఎలా పడితే అలా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక సీన్ కి మరో సీన్ కి సంబంధం లేనట్టుగా జంబ్లింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
  • మ్యూజిక్ & ఎడిటింగ్: భీమ్స్ అందించిన పాటలు ఏవీ రిజిస్టర్ కావు. ఎడిటింగ్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది.
  • సిల్లీ కామెడీ: 'జాతిరత్నాలు'లో ఉన్న ఫ్లో ఇందులో మిస్ అయింది. కొన్ని చోట్ల కామెడీ మరీ అతిగా, అర్థరహితంగా అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ, దర్శకుడు అనుదీప్ కేవలం వన్-లైనర్స్ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టి ఉంటే బాగుండేది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ పండలేదు. సంపత్ రాజ్ ట్రాక్ అసలు ఎందుకు ఉందో అర్థం కాదు.

మొత్తానికి 'ఫంకీ' ఒక  కామెడీ డ్రామా. విశ్వక్ సేన్ తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, బలహీనమైన కథ, కథనం వల్ల సినిమా బోర్ కొట్టిస్తుంది. అనుదీప్ మార్క్ పిచ్చి కామెడీని ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయవచ్చు , సాధారణ ప్రేక్షకులకు మాత్రం ఇది అంతగా రుచించకపోవచ్చు. లాజిక్ వెతకకుండా, కొన్ని వన్-లైనర్స్ కోసం చూస్తే తప్ప ఈ సినిమా 'ఫంకీ'గా అనిపించదు.

Post a Comment

Previous Post Next Post