భారత్ మరియు అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం (Interim Trade Deal) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కనున్నాయి.
అయితే, ఈ ఒప్పందం కంటే కూడా అమెరికా విడుదల చేసిన ఒక మ్యాప్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
- పన్నుల తగ్గింపు: గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ డ్రంప్ భారతీయ ఉత్పత్తులపై విధించిన 50% పన్నును ఇప్పుడు 18 శాతానికి తగ్గించారు. ఇది భారతీయ వ్యాపారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
- వివాదాస్పద మ్యాప్: యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) అధికారికంగా విడుదల చేసిన భారత దేశ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) మరియు అక్సాయ్ చిన్ ప్రాంతాలను భారతదేశంలో భాగంగా చూపించారు.
- దశ మార్చిన అమెరికా: సాధారణంగా అమెరికా తన మ్యాప్‌లలో పీఓకేను విడిగా చూపిస్తుంది లేదా వివాదాస్పద ప్రాంతంగా గుర్తిస్తుంది. కానీ, ఇప్పుడు బహిరంగంగా ఆ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపించడం పాకిస్థాన్ మరియు చైనాలకు కోలుకోలేని దెబ్బ.
ఈ మ్యాప్ విడుదల వెనుక ఉన్న వ్యూహాత్మక అంశాలు ఇక్కడ ఉన్నాయి:
- పాకిస్థాన్ పరిస్థితి: ఇటీవలి యుద్ధ పరిస్థితుల్లో అమెరికా సహాయం చేయకపోయినా, డ్రంప్ వల్లే యుద్ధం ఆగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పొగుడుతూ వచ్చారు. డ్రంప్‌కు నోబెల్ బహుమతి ఇవ్వాలని కూడా కోరారు. కానీ, డ్రంప్ మాత్రం పాక్‌ను కాదని భారత్‌కు మద్దతుగా మ్యాప్‌ను విడుదల చేశారు.
- చైనాకు హెచ్చరిక: అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారత్‌లో భాగంగా చూపడం ద్వారా చైనా ప్రాబల్యానికి అమెరికా అడ్డుకట్ట వేయాలని చూస్తోంది.
- వ్యాపార లబ్ధి: ఈ ఒప్పందం వల్ల అమెరికాకు చెందిన నట్స్, పండ్లు, ఎండు ధాన్యాలు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్‌లో భారీ ప్రవేశం లభించనుంది.
